చంద్రబాబుకు ప్రాణహానీ ఉంది.. వైసీపీ నేతలే చెబుతున్నారు : నారా లోకేష్

-

చంద్రబాబుకు ప్రాణహానీ ఉందని.. ఆ విషయాన్ని స్వయంగా అధికార వైసీపీ నేతలు చెబుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును ములాఖత్ లో కలిసిన తరువాత ఆయన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మా కుటుంబం ప్రమేయం లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉంగా చంద్రబాబు ఒక పైసా కూడా అవినీతి చేయలేదని స్పస్టం చేశారు.

- Advertisement -

చంద్రబాబు జైల్లోనే చచ్చిపోతారని వైసీపీ నేతలు చెబుతున్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నా తల్లి భువనేశ్వరి పై కూడా కేసులు పెడతామని భయపెడుతున్నారన్న ఆయన.. చంద్రబాబును జైలులో పెట్టి 50 రోజులు గడిచిన ఒక్క ఆధారం కూడా బయటపెట్టలేదని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతి చేస్తే ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామని.. అవినీతి చేసిన వ్యక్తి పదిహేనేళ్లుగా బయట తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబును చంపుతామని మావోయిస్టులు లేఖ రాసిన ప్రభుత్వం స్పందించడం లేదన్నారు లోకేష్. చంద్రబాబుకు అనారోగ్య సమస్యలున్నాయి. ఆరు కిలోలు బరువు తగ్గడం వాస్తవమన్నారు. అధికారులు ఒకటి చెబితే.. వైద్యులు మరొకటి చెబుతున్నారని పేర్కొన్నారు. జైలు అధికారులకు కూడా స్వేచ్ఛ ఉన్నట్టు లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...