సబ్సిడీ గ్యాస్ స్కీమ్.. ఏడాదికి 8 సిలిండర్లు ఇవ్వాలని పౌసరఫరాలశాఖ నిర్ణయం

-

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవలే సబ్సిడీ (రూ.500) గ్యాస్‌ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ అర్హుల జాబితా రూపొందించింది. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లకు సబ్సిడీ ఇవ్వాలన్న విషయంపై లెక్కలు సిద్ధం చేసిన ఈ శాఖ అధికారులు.. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అర్హులైనవారి మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.

పౌరసరఫరాల శాఖ లెక్కల ప్రకారం.. ఏటా ఇవ్వాల్సిన గరిష్ఠ సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా తేలింది. ఈ పథకానికి కొద్దిరోజుల క్రితం 39.78 లక్షల మందిని అర్హులుగా అధికారులు తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. అర్హుల్లో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్‌ సిలిండర్ల చొప్పున వినియోగించారని పౌరసరఫరాలశాఖ తేల్చింది. దీంతో ఈ పథకంలో సబ్సిడీపై ఇవ్వబోయే సిలిండర్ల సంఖ్య గరిష్ఠంగా ఏడాదికి ఎనిమిదిగా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ప్రభుత్వం భరించాల్సిన సబ్సిడీ నెలకు రూ.71.27 కోట్లు, ఏడాదికి రూ.855.2 కోట్లుగా తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version