BREAKING : తెలంగాణ గవర్నర్ కు లేఖ రాసిన సుఖేష్ చంద్రశేఖర్

-

BREAKING : తెలంగాణ గవర్నర్ కు లేఖ రాశారు సుఖేష్ చంద్రశేఖర్. ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ ల పై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశాడు సుఖేష్ చంద్ర శేఖర్. గత 2 రోజుల నుంచి నా కుటుంబం… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్ ల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటుందని ఈ లేఖలో తెలిపాడు. పలు ప్రలోభాలను ప్రతిపాదిస్తున్నట్లు లేఖ లో పేర్కొన్నాడు సుఖేష్ చంద్ర శేఖర్.

కేటీఆర్, కవితలకు వ్యతిరేకంగా EDకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లను ఉపసంహరించుకోవాలని, అలాగే అన్ని సాక్ష్యాలను, అంటే “వాట్సాప్ చాట్” కాపీలు, స్క్రీన్‌ షాట్‌లు, ఫేస్‌టైమ్ కాల్ కాపీలు, రికార్డింగ్‌లను ఇవ్వాలని కోరినట్లు లేఖలో పేర్కొన్నాడు. ప్రతిగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో భూమి, 100 కోట్ల నగదు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు సీటు ఇస్తామని ప్రలోభ పెట్టినట్లు లేఖలో ప్రస్తావన చేశాడు సుఖేష్ చంద్రశేఖర్. మరి దీని పై బీఆర్‌ఎస్‌ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version