రైతులకు శుభవార్త..రేపటి నుంచి అందుబాటులోకి సల్ఫర్ కోటెడ్ యూరియా

-

రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి అందుబాటులోకి సల్ఫర్ కోటెడ్ యూరియా రానుంది. అలాగే.. పీఎం కిసాన్ సేవా కేంద్రాలుగా ఎరువుల రిటైల్‌ దుకాణాలు మారనున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎరువుల రిటైల్ షాప్స్ రేపటి (27 వ తేదీ) నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సేవా కేంద్రాలు గా మారుతున్నాయని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులు,ఇతర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ కార్యక్రమాలు నడుస్తున్నాయని… మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. సల్ఫర్ కోటెడ్ యూరియా రేపటి నుంచి అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. భారత్ బ్రాండ్ పేరుతో రేపటి నుంచి ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. రేపు 14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ప్రారంభించి దేశ వ్యాప్తంగా రైతులతో వర్చువల్ గా ప్రధాని మోడీ మాట్లాడుతారన్నారు కిషన్‌రెడ్డి. ప్రతి నెల రెండో ఆదివారం కిసాన్ కా బాత్ కార్యక్రమం ఉంటుందని… సేవా కేంద్రాల లో పనిచేసే సిబ్బంది కి ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version