నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్ జీ కళాశాలలో పట్టభద్రుల ఓటు నమోదుపై మార్నింగ్ వాకర్లతో టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ముచ్చటించారు. కోదండరాం మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కీలకం, పట్టభద్రులు ఓటు నమోదు చేసుకుని ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో బాధ్యతా రాహిత్యమైన, ఒక నిరంకుశమైన పాలన నడుస్తుందని ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే క్రమంలో మేధావులంతా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజల ధనాన్ని దోచుకోవాలని, డబ్బులు చెల్లించకుంటే వాళ్ళ ఆస్తులు అక్రమ ఆస్తులు అన్నట్లుగా ప్రచారం చేసి ప్రభుత్వం సామాన్యులను దోచుకుంటుందన్నారు. ఓవైపు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతుంటే సీఎం హార్టి కల్చర్ మీద సమీక్ష జరుపుతున్నారంటే రాష్ట్రంలో పాలన ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చని విమర్శించారు. దీర్ఘ కాలిక ప్రయోజనాల ద్రుష్ట్యా ఇతర పార్టీల మద్దతు కోరుతున్నానన్నారు.