లాయర్ వామనరావు హత్య కేసు.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశాలు

-

తెలంగాణలో సంచలనం సృష్టించిన లాయర్ వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసుపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. సీబీఐ విచారణ జరపాలన్న పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని చెబుతూ.. 3 వారాల్లో రికార్డులను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

అడ్వొకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని మృతుడు వామనరావు తండ్రి కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్న అంశంపై అభిప్రాయం తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయితే లాయర్ దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. దానిపై కోర్టే నిర్ణయం తీసుకోవాలని గతంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని వివరాలు తమ ముందుంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news