తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభణ.. నాలుగు కేసులు నమోదు

-

 

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు ప్రభలుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కేసులు దీనికి సంబంధించినవి నమోదు అయినాయి. ఈ మేరకు తెలంగాణ హెల్త్ ఈ భాగం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయినట్లు హైదరాబాద్ నారాయణగూడ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ల్యాబ్ నిర్ధారణ చేసింది.

Swine flu cases in telangana

బాధితులలో పశ్చిమ బెంగాల్ కు చెందిన యువకుడు ఉన్నాడని తెలిపింది. అలాగే టోలిచౌకి చెందిన వృద్ధుడు, నిజామాబాద్ జిల్లా పిట్లం కు చెందిన మరొక వ్యక్తి ఉన్నాడని స్పష్టం చేసింది. అదే సమయంలో హైదర్ నగర్ డివిజన్ కు చెందిన 51 సంవత్సరాల మహిళ కూడా ఉన్నట్లు స్పష్టం చేసింది మెడిసిన్ ల్యాబ్. అదే సమయంలో జార్ఖండ్ నుంచి వచ్చిన మరొక మహిళకు కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు భయపడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి వణికి పోతున్నారు జనాలు.

Read more RELATED
Recommended to you

Latest news