అత్యవసర సేవలకు GHMC కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలి – తలసాని

-

అత్యవసర సేవలకు GHMC కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో GHMC, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, EVDM, కలెక్టర్ తదితర శాఖల అధికారులతో మాట్లాడిన మంత్రి తలసాని..ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఎక్కడ నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. చెట్లు, కొమ్మలు కూలిన చోట నుండి వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ వాటర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని.. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని.. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

Read more RELATED
Recommended to you

Latest news