బోనాల పండుగ అంటే “తిని-తాగుడు” పండుగ – తలసాని

-

బోనాల పండుగ అంటే తిని… తాగుడు పండుగ అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌. మహంకాళి జగదాంబికా అమ్మవారి జాతర బోనాల ఉత్సవాలు ఘనంగా ఈ రోజు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. అంగరంగ వైభవంగా తెలంగాణ నడి బొడ్డున జగద్ధంబికా అమ్మవారి బోనాలు జరుగుతాయని.. సికింద్రాబాద్..లాల్ దర్వాజ్ హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నారు.

తెలంగాణ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీ లో బోనాలు జరిగాయని… తెలంగాణ వచ్చాక తెలంగాణ రాష్ట్ర పండుగ గా బోనాలు జరుపుకొంటున్నామని వెల్లడించారు. బోనాలు అంటే… తోట్టేలు., గటాల ఊరేగింపు., రేపు ఫలహారం బండి., గట్టం..అన్నారు. భారత దేశంలో హిందూవుల గురించి మాట్లాడుతారు కానీ హిందువుల పండుగలకు సహకరించేది కెసిఆర్ అని కొనియాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరూ సహకరించాలని… అన్ని డిపార్ట్మెంట్ సంయమనంతో బోనాల జాతర జరగాలని కోరారు.. తెలంగాణ రాష్టం ఏర్పడక ముందు అతి తక్కువ మంది తో గోల్కొండ అమ్మవారి జాతర జరిగేదని…ఇప్పుడు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news