బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బండి సంజయ్… జాగ్రతగా మాట్లాడాలని హెచ్చరించారు.రాజకీయల మీద అవగాహన పెంచుకొని మాట్లాడాలని హితవు పలికారు. బీజేపీ ఎవరికి బీ టీం అనేది కొండా విశ్వేశ్వరరెడ్డి ని అడిగితే చెప్తారని అన్నారు. బీజేపీని నమ్మడం లేదని ఆయనే చెప్పారని అన్నారు.
ముందు విశ్వేషర్ రెడ్డికి సమాధానం చెప్పమని బండి సంజయ్ కి సూచించారు. ఇక కేసీఆర్ మూడు నియోజకవర్గాలకు మాత్రమే సీఎం కాదని అన్నారు. గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లకే అన్ని నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ 80 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలు ఓ దగా అంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి.
కెసిఆర్ కి శంకరమ్మ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. శంకరమ్మకి ఓడిపోయే సీటు ఇచ్చి అవమానం చేశారని మండిపడ్డారు. గాయత్రీ రవికి రాజ్య సభ సీటు ఇచ్చారని.. శంకరమ్మకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేసీఆర్ ని తలసాని తన్ని తరుమూత అన్నాడని.. ఆయన్ని మంత్రి చేశావని అన్నారు. ఇక తరిమి కొట్టిన దానంని ఎమ్మెల్యే చేశాడని అన్నారు. 9 ఏండ్లు శంకరమ్మకు దగా చేసింది కేసీఆరే నని అన్నారు.