టీచర్ దాడిలో UKG విద్యార్థి మృతిపై స్పందించిన గవర్నర్ తమిళిసై

-

హైదరాబాద్ రామంతాపూర్‌లో యూకేజీ విద్యార్ధి హేమంత్‌ మృతి చెందిన ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ స్పందించారు. హేమంత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రతి విద్యార్ధికి సురక్షితమైన, పోషణ, సహాయక అభ్యాస వాతావరణాన్ని అందించాలని తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్ని పాఠశాలలకు సూచించారు. విద్యార్థులు ఉపాధ్యాయుల ద్వారా స్ఫూర్తి పొందుతారని వారిని రోల్ మోడల్స్‌గా చూస్తారని, వారి చర్యలు సానుభూతి, దయకు ఉదాహరణగా ఉండాలని.. ఈ విషయాన్ని ఉపాధ్యాయులందరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఉపాధ్యాయ సంఘం మొత్తం ఈ విషాదాన్ని పునరాలోచించాలని, విద్యార్థుల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను పునరుద్ధరించుకోవాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

హోం వర్క్ చేయలేదని .. హేమంత్ తలపై పలకతో టీచర్ కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం హేమంత్​ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం హేమంత్ మృతి చెందాడు. తమ కుమారుడి మృతికి పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించాలని.. తమ కుమారుడి మరణానికి కారణమైన టీచర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని హేమంత్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news