తెలంగాణలో అత్యంత ఆందోళనకర పరిస్థితులు – గవర్నర్‌ తమిళిసై

-

తెలంగాణలో అత్యంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ తమిళిసై..మాట్లాడారు. తెలంగాణ లో ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయి..రాష్ట్రం లో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు…. అందరికీ ఫార్మ్ లు కావాలని..తెలంగాణ లో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామన్నారు. కొంత మందికి నేను నచ్చక పోవచ్చని..నాకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టమని తెలిపారు. ఎంత కష్టం అయిన పని చేస్తానని..పవిత్ర తెలంగాణ నేలపై జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందని తెలిపారు. దేశ భక్తి తో కూడిన ఆరు దశాబ్దాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని..తెలంగాణ భిన్నత్వం లో ఏకత్వానికి నిదర్శనమని వివరించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది…విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇతరులకు అభినందనలు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version