హైడ్రా ఏర్పాటుతో నగరం మరింత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

-

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్ పల్లిలో సుమారు రూ.28.5 కోట్లతో రోడ్లు భవనాల శాఖ, పీవీ రావు నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్లై ఓవర్ ను శనివారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుంది.

మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అభివృద్ధి ఆగకుండా మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తాం అన్నారు. ఈ ప్రాంతం నుండే రాష్ట్రానికి ఎక్కువగా ఆదాయం సమకూరుతుందని, దేశం నుండి ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు.హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి నగర అభివృద్ధికి మరింత చేయూతనిచ్చేలా ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. మూసీ అబివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news