పారదర్శకతతో మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సంక్షేమం, క్లీన్ ఎనర్జీని పెంపొందించడమే లక్ష్యం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బేగంపేటలోని వివంతా హోటల్ లో జరిగిన మినరల్ ఎక్స్ ప్లోరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్డు షోలో పాల్గొని మాట్లాడారు కిషన్ రెడ్డి. గనుల ఎక్స్ ప్లోరేషన్ కు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన సమయం సందర్భమన్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకంలో నూతన ఆవిష్కరణలతో పాటు మైనింగ్ సంబంధిత వర్గాల సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం నూతన ఆవిష్కరణలతో వైవిద్యంగా ముందుకు వెళ్తోందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం, చొరువతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు స్వయం సమృద్దిని పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను రూపొందించడం.. 2047 నాటికి అభివృద్ధి