తార్నాకలో కుటుంబం ఆత్మహత్య కేసు.. కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

-

హైదరాబాద్​ తార్నాకలో నివాసముంటున్న విజయ్‌ప్రతాప్‌(33), సింధూర(32), వారి కుమార్తె ఆద్య(4), విజయ్ తల్లి జయంతి(65) ఆదివారం రోజున ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వారి మరణం పలు అనుమానాలకు తావిస్తోందని భావిస్తున్నట్టు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి/సోమవారం తెల్లవారుజామున భార్య, కుమార్తె, తల్లిని విద్యుత్‌ తీగ (కరెంట్‌వైర్‌)తో గొంతు బిగించి చంపి అనంతరం ప్రతాప్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. భర్త విజయ్ చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా.. భార్య సింధూర హైదరాబాద్​లో ఓ బ్యాంకు మేనేజర్​గా బాధ్యతలు నిర్వహిస్తోంది. వృత్తిరీత్యా ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉండగా.. విజయ్​కు ఇటీవలే ఉద్యోగంలో పెద్ద హోదా లభించడంతో.. కుటుంబాన్ని చెన్నైకి షిఫ్ట్ కావాలని కోరాడు. ఈ క్రమంలో తరచూ ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉండేవారు.

ఆదివారం రాత్రి కూడా ఇదే విషయంలో గొడవపడ్డారు. మరుసటి రోజు విజయ్ ఫ్రెండ్​.. విజయ్​కు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్లింటికి వెళ్లాడు. ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఫ్యాన్​కు వేలాడుతూ విజయ్.. సింధూర, ఆద్య, జయతి కింద పరుపుపై విగతజీవులై కనిపించారు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news