రాచకొండ కమిషనర్‌గా తరుణ్‌ జోషి

-

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పిటి నుంచి ప్రభుత్వ అధికారుల బదిలీలపై ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొందరిని బదిలీలు చేస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో భారీగా బదిలీలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పలువురు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది.

రాష్ట్రంలో 12 మంది ఐపీఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల చేపట్టిన బదిలీల్లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌ బాబు గత డిసెంబరులోనే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే జాయింట్‌ కమిషనర్‌గా ఆయన సుదీర్ఘకాలం అక్కడ పని చేయడంతో ఎన్నికల నిబంధనల మేరకు ఆయన్ను మరోసారి మార్చాల్సి వచ్చింది. ఆయన స్థానంలో తాజాగా తరుణ్‌ జోషి నియమితులయ్యారు. అలాగే వెయిటింగ్‌లో ఉన్న కొందరికి పోస్టింగులు ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న నవీన్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు.

Read more RELATED
Recommended to you

Latest news