BRS మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ప్రకటన చేశారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న తాటికొండ రాజయ్య తాజాగా కీలక ప్రకటన చేశారు. వరంగల్ ఎంపీ సీటు బీఆర్ఎస్ లో చిచ్చుపెట్టింది. ఆ టికెట్ ఆశిస్తున్న స్టేషన్ గన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య….పార్టీ స్పందించకపోవడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.
ఈ మేరకు నిన్న కేసీఆర్ కు రాజీనామా లేఖ పంపించారు స్టేషన్ గన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఇంతకాలం పార్టీ విధేయుడిగా ఉన్నానన్న ఆయన…. తగిన గుర్తింపు లేకపోవడం, పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. స్టేషన్ గన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య…కాంగ్రెస్ పార్టీలో చేరితే… వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.