రేపు ఝార్ఖండ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి?

-

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ నెల 5వ తేదీన ఝార్ఖండ్‌ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్‌ యాత్ర’ ప్రస్తుతం ఝార్ఖండ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ యాత్రలో పాల్గొనేందుకు రేవంత్‌ రెడ్డి ఆ రాష్ట్రం వెళ్లనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తరవాత.. సీఎం పర్యటనపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి.

మరోవైపు ఝార్ఖండ్‌లో హేమంత్‌ సోరెన్‌ రాజీనామాతో నూతన ముఖ్యమంత్రిగా చంపయీ సోరెన్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీల సంకీర్ణ ప్రభుత్వం శాసనసభలో ఈ నెల 5వ తేదీన బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ కూటమి ఎమ్మెల్యేలు 40 మందిని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలోని ఓ రిసార్టుకు తరలించగా వీరంతా 5వ తేదీ ఉదయం రాంచీకి వెళ్లనున్నారు. ఈ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ పార్టీ పటిష్ఠ భద్రత కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news