విద్యార్థులు క్రమ శిక్షణగా ఉండే బాధ్యత ఉపాధ్యాయులదే : సీఎం రేవంత్ రెడ్డి

-

విద్యార్థులు క్రమ శిక్షణగా ఉండే బాధ్యత ఉపాధ్యాయులదే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు అయితే ఉపాధ్యాయులే వారిని దారిలోకి తీసుకురావాలని సూచించారు. పోలీస్ ఉన్నతాధికారులకు తాను సూచిస్తున్నాను. పలు కళాశాలల యజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి విద్యార్థులు డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి అలవాటు పడకుండా చూసుకోవాలని చెప్పాలని వివరించారు. ఏ కళాశాల యాజమాన్యం అయిన అందుకు సహకరించకుంటే ఆ కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

విద్యార్థులు చెడు అలవాట్లకు కాకుండా విద్య పై దృష్టి సారించే విధంగా చూడాలన్నారు. డ్రగ్స్ కేసుల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు నాలుగు ఐదు ఏళ్ల కేసులు వీగిపోతున్నాయి. అలా కాకుండా 6 నెలల్లో సమస్యలు పరిష్కారం అయ్యేవిధంగా ప్రత్యేక కోర్టులు తీసుకొస్తామని తెలిపారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news