తెలంగాణ రాష్ట్ర హోంగార్డులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. HMDA గ్రౌండ్ లో జరిగిన SDRF కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హోంగార్డులు పోలీసులకు ధీటుగా పని చేస్తున్నారు. హోంగార్డులకు రోజుకు రూ.1000 వేతనం ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. హోంగార్డుల వీక్లీ పరేడ్ అలవెన్స్ రూ.200 చేస్తాం. మరణించిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం, 2025 జనవరి 01లోపు మెరుగైన వైద్య సాయం అందిస్తామని తెలిపారు.
ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసులది అన్నారు. మేమెంత చేసిన మీరు వ్యవహరించే విధానంతోనే ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయన్నారు. బాధితుల పట్ల గౌరవంగా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. అప్పుడప్పుడూ ప్రెండ్లీ పోలీసింగ్ అని వింటుంటాం. ప్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్ తోని ఫ్రెండ్లీగా ఉండటం కాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు.. అన్యాయం జరిగిన వారు పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు వాళ్లను కూర్చొబెట్టి వాళ్ల ఫిర్యాదును కనుక్కొని పరిష్కరించాలన్నారు. సమాజంలో నేరాల విధానం మారింది. సైబర్ క్రైమ్ ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.