తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసిన “మాయ”

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో  శుక్రవారం సీఎం రేవంత్
రెడ్డి పాల్గొన్నారు. నేడు తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ముందుగా సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని  ప్రారంభించారు. అనంతరం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను సందర్శించారు.

అదే విధంగా నేడు డా బీఆర్ అంబేద్కర్ వర్ధంతి  కావడంతో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి వేదికపైకి చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక స్వాగతం పలికారు పోలీస్ సిబ్బంది. సీఎం సెక్యూరిటీలోని ప్రత్యేక ట్రైన్డ్ డాగ్ అయిన ‘మాయ’ (MAYA)తో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించారు. మాయ అందించిన పుష్పగుచ్చం అందుకున్న సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news