సెప్టెంబర్ 2 నుంచి తెలంగాణలో టీచర్ బదిలీ కౌన్సిలింగ్

-

తెలంగాణలో టీచర్ బదిలీలపై మరో కీలక అప్డేట్‌ వచ్చింది. సెప్టెంబర్ 2 నుంచి తెలంగాణలో టీచర్ బదిలీ కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు త్వరలోనే బదిలీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేయనుంది తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ. ఇక అటు తెలంగాణ లో టీచర్ల బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

టీచర్ల బదిలీపై మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ బుధవారం ఆదేశాలను జారీ చేసింది హైకోర్టు. ఉపాద్యాయ సంఘాల నేతలకు 10 అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. టీచర్ యూనియన్ల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్ల కేటాయించడానికి అనుమతించింది హైకోర్టు. భార్యభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమన్నది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news