ఎమ్మెల్యేలే వైసీపీని ముంచుతారా?

-

వైసిపి అంటే జగన్…జగన్ అంటే వైసీపీ..అందులో ఎలాంటి డౌట్ లేదు. సింగిల్ హ్యాండ్ తో పార్టీని నడిపించుకుంటూ వస్తున్నారు. ఏ ఎన్నికలైన మెజారిటీ నేతలు గెలిచేది జగన్ అనే బ్రాండ్ తోనే.. ఇక గత ఎన్నికల్లో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు ముగ్ధులైన ప్రజలు వైసీపీకి భారీ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు. కానీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే వైసీపీకి ప్రమాదకరంగా మారారా? వారి వల్లనే వైసిపి ఓటమిని మూటగట్టుకొనుందా? అవుననే అంటున్నాయి ఇప్పటి సర్వేలు, పరిస్థితులు.

ఎమ్మెల్యేలపై స్థానిక నేతలు, సామాన్య కార్యకర్తలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కొంతకాలంగా “జగనన్న ముద్దు – మా ఎమ్మెల్యే వద్దు” అంటూ స్థానిక నేతలు రోడ్లెక్కారు. ఒకచోట ఇలా జరిగితే అక్కడి నేతలలో సఖ్యత లోపించటం అనుకోవచ్చు, కానీ రాష్ట్రంలో చాలా జరుగుతుంటే జగన్ ఈ విషయాన్ని  తీవ్రంగా పట్టించుకోవాల్సిందే. ఈ విషయం జగన్ దృష్టికి వెళ్లిందా? లేదా? వెళ్లక పోతే మాత్రం వైసీపీకి చాలా నష్టం జరుగుతుంది.

ఒకవేళ జగన్ దృష్టికి చేరిన తర్వాత కూడా  దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే మాత్రం వైసీపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఎప్పటినుండో పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే స్థానిక నేతలు అండ ఉండాల్సిందే జగన్ క్రేజ్ సరిపోదు. ఎందుకంటే అటు వైపు టి‌డి‌పి-జనసేన కలుస్తున్నాయి. పొత్తు ఉంటే వైసీపీకి ఎంత కాదు అనుకున్న నష్టం ఉంటుంది.

ముఖ్యంగా గుంటూరు టూ విశాఖ వరకు పొత్తు ప్రభావం ఎక్కువ. ఆ జిల్లాల్లో జగన్ ఇమేజ్ మీద ఆధారపడితే కష్టం..ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుండాలి. కానీ ఎమ్మెల్యేలపై స్థానిక నేతల అసంతృప్తి వైసీపీ అధిష్టానానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి ఈ సమస్యను జగన్ సమర్థవంతంగా అధిగమిస్తారా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news