నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న తీన్మార్ మల్లన్న

-

తీన్మార్ మల్లన్న (చింత పండు నవీన్ కుమార్) నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో ఉదయం 11 గంటలకు తీన్మార్ మల్లన్న (చింత పండు నవీన్ కుమార్) ను ప్రమాణ స్వీకారం చేయించనున్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

teenmar mallanna

ఇక ఈ కార్యక్రమానికి మూడు జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కాగా ఇటీవల జరిగిన వరంగల్- నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు తీన్మార్ మల్లన్న. అయితే.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి రాకేష్‌ రెడ్డి.. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news