కువైట్ ప్రమాదంపై జైశంకర్ ఆరా.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం

-

కువైట్‌లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం జరగడంతో 49 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో 42 మంది భారతీయులే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు అక్కడప్రస్తుత పరిస్థితుల గురించి కువైట్ అధ్యక్షుడు అబ్దుల్లా అలీ అల్ యహ్యతో ఫోన్​లో మాట్లాడినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. కువైట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపే బాధ్యత తనదేనని కువైట్ అధ్యక్షుడు హామీ ఇచ్చారని వెల్లడించారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యం సహాయం అందుతుందని.. మృతదేహాలను త్వరలోనే ఇండియాకు పంపించాలని కోరినట్లు జైశంకర్ ఎక్స్​ వేదికగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news