Teenmar Mallanna’s controversial comments on Telangana women collectors: తెలంగాణ మహిళా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్ల పై తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న… వరదలపై మాట్లాడుతూ… మహిళా కలెక్టర్లను టార్గెట్ చేశారు. కరీంనగర్ కలెక్టర్ అలాగే మరో ఐఏఎస్ ఆఫీసర్ అలుగు వర్షినిపై… వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోయారు తీన్మార్ మల్లన్న.
పనిచేస్తే చేయండి లేదా ఇంట్లో పడుకోండి అంటూ…. ఐఏఎస్ ఆఫీసర్లు అలుగు వర్షిని మరియు పామేల సత్పతి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్… తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణ మహిళా కమిషన్ సోషల్ మీడియా కు ట్యాగ్ చేసి మరీ తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేస్తున్నారు.
https://x.com/Gowtham_Goud6/status/1831670048299348050