కోల్‌కతాలో మెడికో విద్యార్థిని హత్యాచార నిందితుడికి ఇంతవరకు శిక్షపడకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని తోటి వైద్యులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నేటికి కోల్‌కతాలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా..ఈ కేసులో సీబీఐ విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది.కానీ, ఇంతవరకు శిక్ష పడకపోవడంపై పలువురు బెంగాల్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నారు.
తాజాగా బెంగాల్లో వైద్యురాలి హత్యాచారం కేసులో పాలనా యంత్రాంగం వ్యవహరించిన తీరు అసలు బాగాలేదని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. ప్రజల్లో న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయిందన్నారు. అందుకే తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. ‘బెంగాల్లో తప్పు మీద తప్పు జరుగుతోంది. ప్రభుత్వం ప్రజలకు నమ్మకం కలిగించాలి. దోషులను శిక్షించాలి. చట్టం చేస్తే సరిపోదు. పక్కాగా అమలు చేయడం మరింత ముఖ్యం’ అని తెలిపారు.