తెలంగాణలో భారీ వర్ష సూచన …!

రాబోయే 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షం ఓ మోస్తారు నుండి భారీగా కురావొచ్చని అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఆరు కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం బలహీనపడిన కారణంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

rains-in-telanga
rains-in-telanga

వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు కూడా పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అలాగే 24 గంటలు దాటిన కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వారు తెలుపున్నారు. కాబట్టి రైతులు, అధికారులు తగిన జాగ్రత్త వహించాలని హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి రాజారావు తెలియజేశారు.