తెలంగాణ టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

-

తెలంగాణ టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్సెస్సీ బోర్టు విడుదల చేసింది. ఈ ఫ‌లితాల‌ను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చు.

ఇటీవల తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహించారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో 73.03 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది.  పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత కాగా.. ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. ఇక గ‌తేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా.. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news