ఏపీలో ఉచిత బస్ పథకానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి సక్సెస్ అయింది. అటు తెలంగాణలో కూడా ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకంపై కసరత్తు చేస్తున్నారు.ఈ ఎన్నికల్లో సక్సెస్ అందుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏపీలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది.
ఉచిత బస్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కూటమి అధికారం సాధించి రెండు వారాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఈ తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక పథకాలు అమలుపై దృష్టి సారించింది. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసినప్పుడు కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అలాంటి సమస్యలు ఏపీలో రాకుండా ముందుగానే పరిష్కరించేందుకు దీనిపై దృష్టి సారించినట్లుగా రవాణా శాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు.
ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రధానంగా ఆటో డ్రైవర్లు తమకు గిరాకీ రావట్లేదని ఆందోళనలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున దానికి ప్రత్యమ్నయంగా మరో పథకాన్ని అమలు చేయాలనే దిశగా ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అలాగే ఈ పథకాన్ని అమలు చేసిన తర్వాత రాష్ట్రానికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు భారం పడుతుంది.తద్వారా ప్రతినెల 90 నుంచి 100 కోట్ల వరకు భారంపడే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేశారు. అయినప్పటికీ ఈ పథకాన్ని ప్రభుత్వం త్వరగా అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అన్నీ కుదిరితే జూలై 1 నుంచి ఉచిత బస్ పథకాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.