తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు అలర్ట్..పరీక్షా సమయాల్లో మార్పులు !

-

తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు అలర్ట్‌. తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చింది. ఇక నుంచి తొమ్మిది, పదో తరగతుల పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నది. 2022-23 నుంచి సంస్కరణలను ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది.

ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయించనున్నారు. సైన్స్‌పేపర్‌లో ఫిజిక్స్‌, బయాలజీ రెండింటికి సగం సగం మార్కులు కేటాయించింది. ఈ మేరకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, అలాగే పరీక్షా సమయం 3 గంటలు కేటాయించగా, సైన్స్‌ పేపర్‌ కు మాత్రం 3 గంటల 20 నిమిషాల సమయం కేటాయించారు. దీనికి సంభందించిన ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఏప్రిల్‌ 3 నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version