ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వం ఇవాల రెండు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. సివిల్ కోర్టు అమైండ్ మెంట్ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభ ముందుకు తీసుకురాగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 2 గంటలకు పైగా కేటీఆర్ ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ లు కేటీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు. అనంతరం సభలో స్వల్ప వివాదం తలెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిని వెనకాల ఉండే అక్కలు.. ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలారు. ఆ అక్కల మాటలు వింటే.. జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చివరికీ  ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సభ సంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని సభను వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news