డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ?

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పార్టీ తమ సీట్లను ప్రకటించేసింది. ఇప్పటికే 115 సీట్లను భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అడు కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు కూడా క్యాండిడేట్ల ఫైనల్ లిస్టును తయారుచేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telangana assembly elections on December 7
Telangana assembly elections on December 7

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ సీఈవో కార్యాలయం తాత్కాలిక ఎన్నికల షెడ్యూల్ రూపొందించింది. దాని ప్రకారం నవంబర్ 12వ తేదీన నోటిఫికేషన్ ప్రకటించి 19వ తేదీ వరకు నామినేషన్ లో స్వీకరిస్తారు. నవంబర్ 22వ తేదీన తుది అభ్యర్థుల జాబితా ఫారం ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7వ తేదీన ఫలితాలు డిసెంబర్ 11వ తేదీన ప్రకటిస్తారు అని రాసిన ఫ్లెక్సీని ప్రదర్శనకు ఉంచారు అధికారులు. అయితే ఈ తేదీలకు అటు ఇటుగా తెలంగాణ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news