తెలంగాణ అసెంబ్లీ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసింది తెలంగాణ అసెంబ్లీ. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రమాణికం కాదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలి.
ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు సీట్లు పెంచాలి. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాకే లోక్‌సభ పునర్వీభజన చేయాలి. ’ అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిథ్యం 24% నుంచి 19% కి పడిపోతుంది… డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్ అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.