తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 8 బిల్లులు ఇవే..

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో శాసనసభ ఎనిమిది కీలక బిల్లులకు సోమవారం ఆమోదం తెలిపింది. ఆ త‌ర్వాత‌ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సభను మంగళవారం ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు. ఆమోదం పొందిన బిల్లులు ఇవే.. 1.తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల చట్టం-2018 సవ రణ ఆర్డినెన్స్‌ బిల్లు-2020. 2. తెలంగాణ విపత్తు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఆర్డినెన్స్‌ బిల్లు-2020.

3. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయసు పెంపు, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు-2020. 4. తెలంగాణ ఆర్థిక బాధ్యత, బడ్జెట్‌ నిర్వహణ సవరణ బిల్లు- 2020. 5. తెలంగాణ వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రెండో సవరణ బిల్లు. 6. టీఎస్‌ బీపాస్‌ బిల్లు. 7. తెలంగాణ సివిల్‌ కోర్టు చట్టం 1972 సవరణ బిల్లు. 8. తెలంగాణ కోర్టు ఫీజు, వ్యాజ్యాల మదింపు చట్టం- 1956 సవరణ బిల్లు.