ఆరు నెలల్లో తెలంగాణకు రూ.9,679 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

-

ఈ ఏడాదిలో తొలి ఆరు నెలల్లో తెలంగాణకు రూ.9,679 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్​డీఐ) వచ్చాయి. కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. ఎఫ్​డీఐలను ఆకర్షించడంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్​ వరకు దేశంలో తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 11వ స్థానాన్ని దక్కించుకుంది. ఏపీకి కేవలం రూ.630 కోట్లు మాత్రమే వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం 2019 అక్టోబరు నుంచి దేశంలోకి వస్తున్న ఎఫ్‌డీఐలను రాష్ట్రాల వారీగా విభజించి చూపుతుండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.1,68,875.46 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డేటాలో వెల్లడైంది. ఇందులో మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో తొలి 5 రాష్ట్రాల వాటా రూ.1,44,544.11 కోట్ల (85.59%) మేర ఉండగా.. మొత్తం పెట్టుబడుల్లో తెలంగాణకు 5.73% వాటా దక్కగా, ఆంధ్రప్రదేశ్‌ వాటా కేవలం 0.37%కి పరిమితమైంది.

Read more RELATED
Recommended to you

Latest news