తెలంగాణ బీజేపీ ఆఫీసులో వాస్తు మార్పులు చేసేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తొలి ఫలితం రిలీజ్ కానుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం డిసెంబర్ మూడో తేదీన జరగనుంది.
కాగా బీజేపీ హిందువుల పక్షాన పోరాడే పార్టీ అని ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీని ప్రకారమే వారి అలవాట్లు, అభిరుచులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, బీజేపీ కార్యాలయంలో వాస్తు మార్పులకు తెరలేపింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కొన్ని మార్పులు చేయనున్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొన్ని మార్పులు చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు బిజెపికి 10 లోపు సీట్లు వస్తాయి అని తేల్చి చెప్పడంతో…. వాస్తుపరంగా వచ్చిన మార్పుల వల్లే సీట్లు పెరిగాయని బీజేపీ భావిస్తోంది. అందుకే మళ్లీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది.