తెలంగాణ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

-

కాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రవేశ పెట్టబోతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఇవాళ్టి బడ్జెట్ సమావేశానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈనెల 26న అసెంబ్లీకి సెలవు ప్రకటించగా తిరిగి 27న బడ్జెట్‌ పద్దుపై చర్చ జరుగుతుంది. మరోవైపు ఇవాళ్టి బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలిసింది. ఆరు గ్యారంటీలకు ప్రత్యేక కేటాయింపులు ఉండనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news