నేడే తెలంగాణ మంత్రి మండలి సమావేశం

-

ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ  రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో  రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ భేటీలో  రైతు రుణమాఫీతో పాటు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ప్రధానంగా రైతు రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమాకు కూడా కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వీటిపైన కేబినెట్​లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. లోక్​సభ ఎన్నికల దృష్ట్యా తాత్కాలిక బడ్జెట్​ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం పూర్తి బడ్జెట్ పద్దులపై కసరత్తు చేస్తోంది. ఈ అంశాలు కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు ముగిసినందున ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు సొంతమైంది. దీనివల్ల హైదరాబాద్​లోని ఏపీ ఆస్తులతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు మంత్రులు చర్చించనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news