వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసే మోసాలకు ప్రజలు టీడీపీకి 2029లో సింగిల్ డిజిట్ కు పరిమితం చేయడం అతి తొందరలోనే ఉందన్నారు వైయస్ జగన్. అయ్యన్న పాత్రుడు బూతులు మాట్లాడతాడు.. అలాంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇస్తున్నారని ఆగ్రహించారు.

ఓడిపోయామనే భావన మనసులో నుంచి తీసేయండి.. మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో ఉంది.. నియోజకవర్గాల్లో కార్యకర్తలకి తోడుగా నిలబడండని తెలిపారు. మన కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలి.. ఇది మాత్రం కచ్చితంగా చెప్తున్నాను.
కొన్ని కొన్ని చోట్ల అవమానాలు, దాడులు, ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూశామని ఆవేదన వ్యక్తం చేశారు వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్. ప్రతి కార్యకర్తకు తోడుగా ఉందాం భరోసా ఇద్దాం కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మన కోసం నిలబడ్డారు. మనకు ఓట్లు వేసి దెబ్బలు తిన్నారు వారందరికీ తోడుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్.