BREAKING: తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు..!

-

BREAKING: తెలంగాణ కేబినెట్ సమావేశం రద్దు అయింది. క్యాబినెట్ సమావేశానికి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతోంది.

Telangana cabinet meeting cancelled

నేడు సెక్రటేరియట్ లో జరుగనున్న తెలంగాణ క్యాబినెట్ సమావేశానికి అనుమతి ఇవ్వలేదు కేంద్ర ఎన్నికల కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో క్యాబినెట్ సమావేశానికి అనుమతి ఇవ్వలేదు ఎన్నికల కమిషన్. కానీ ఈ రోజు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముందే నిర్ణయించింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. అయితే..ఈ కేబినేట్‌ మీటింగ్‌ రద్దు అయింది. దీంతో అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news