BRS పార్టీలోకి రాములమ్మ…క్లారిటీ ఇచ్చేసింది !

-

BRS పార్టీలోకి వెళ్లడంపై రాములమ్మ…క్లారిటీ ఇచ్చేసింది. నిన్న గులాబీ పార్టీని మెచ్చుకుంటూ విజయశాంతి పోస్ట్‌ పెట్టారు. దీంతో విజయశాంతి…మళ్లీ గులాబీ పార్టీలోకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. అయితే.. దీనిపై రాములమ్మ క్లారిటీ ఇచ్చేశారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు ఉంటుందన్నారు.

Vijayashanthi Tweet Against Kishan Reddy To Support BRS

బీజేపీ దండయాత్ర విధానం నిన్నటి నా పోస్ట్ ల‌ వ్యక్తపరిస్తే అవగాహన చేసుకునే తత్వం లేని కొందరు ఆ పోస్ట్ పై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా కథనాలు వారే రాసి వ్యాఖ్యానిస్తూ తమ తమ సొంత కల్పన కొనసాగిస్తున్నారు అని ఆగ్రహించారు. సరే… అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కాని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్నవాళ్లకు వివరణలు ఇచ్చి ప్రయోజనం లేదని బీజేపీకి చురకలు అంటించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news