ఆగస్టు 1న మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఆగస్టు 01న సాయంత్రం 4.30 గంటలకు ఉంటుందని నిర్ణయించాం.కానీ మధ్యాహ్నం 2.30 గంటలకే కేబినెట్ సమావేశం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే పలు విషయాలపై చర్చించారు.
ముఖ్యంగా తెలంగాణకు జరిగిన అన్యాయంపై, పాలమూరు వలసలపై ఆనాడు నేను అసెంబ్లీలో మాట్లాడాను. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పై నేను అసెంబ్లీలో ఎంత మాట్లాడానో.. కేసీఆర్ పార్లమెంట్ లో ఎంత మాట్లాడారో రికార్డులు తీయండి. ఇతరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చింది వీళ్లు.. జర్నలిస్ట్ పై కేసు పెట్టామని చెబుతున్న వీళ్లు… వారి పాలనలో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఆమె చానల్ ను గుంజుకున్నారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ పై మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఆడబిడ్డలను జైల్లో పెట్టినందుకే ఇప్పుడు ఆ పాపం అనుభవిస్తున్నారు. ఆనాడు నన్ను జైల్లో పెట్టినా నేను భయపడలేదు. అబద్దాలు చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు. విద్యుత్ పై మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆగస్టు 1, 2న బీఆరెస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్దం. మీరెంత అబద్ధాలు చెబితే నేను అంత నిజాలు చెబుతానని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.