టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు: సీఎం

-

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారని తెలిపారు. కమిషన్కు కొత్త ఛైర్మన్‌, సభ్యులను నియమిస్తామని వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు ఏర్పాటయ్యాక నియామకాలు చేపడతామని చెప్పారు. గవర్నర్‌కు టీఎస్‌పీఎస్సీ సభ్యులు రాజీనామా సమర్పించారన్న సీఎం.. గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నాక కొత్త బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొత్త బోర్డు ఏర్పాటు తర్వాత పోటీ పరీక్షలు నిర్వహిస్తామని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రూప్‌-2 పరీక్షలపై అధికారులతో చర్చించి నిర్ణయిస్తామని వెల్లడించారు.

హైదరాబాద్ సచివాలయంలో ప్రజాపాలనకు సంబంధించి లోగో, దరఖాస్తులను సీఎం రేవంత్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. “ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు కృషిచేస్తోంది. రైతుబంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు. మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత ఎల్‌ అండ్‌ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తెలుస్తుంది.” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news