ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

-

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం, రైతు బంధు వంటి హామీలు అమలు చేసిన సర్కార్ ఇప్పుడు మరిన్ని హామీలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇవాళ ధరణి పోర్టల్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

 

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, భూయాజమాన్యం వివరాలు సులభంగా తెలుసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్ పోర్టల్ విధివిధానాలు, సమస్యలు, వాటి పరిష్కాలు, ఇతర అంశాలపై  కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ పోర్టల్లో చాలా లొసుగులు ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి రాగానే ధరణిని ప్రక్షాళన చేస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ధరణి పోర్టల్ పై ఇవాళ సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

ధరణి పోర్టల్లో మార్పులు చేసి దాని పేరును ‘భూమాత’గా మారుస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన విషం తెలిసిందే. ఈ భేటీలో రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా చర్చ జరిగే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news