తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ములుగు నుంచి బస్సు యాత్ర ద్వారా హస్తం పార్టీ ప్రచారం ప్రారంభించనుంది. ఈ బస్సు యాత్ర వరంగల్, మహబూబాబాద్ , పెద్దపల్లి, కరీంనగర్ , నిజామాబాద్ పార్లమెంట్‌నియోజకవర్గాల పరిధిలోని ములుగు , భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, బాల్కొండ, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజక వర్గాల్లో బస్సు యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ములుగులో బస్సు యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం తిరిగి దిల్లీకి వెళ్తారు.
ఈనెల20న కరీంనగర్ నుంచి చొప్పదండి, కొండగట్టు ఆలయ సందర్శన జగిత్యాల మీదుగా కోరుట్ల, ఆర్మూర్, బాల్కొండ మీదుగా నిజామాబాద్‌కు బస్సు యాత్ర చేరుకుంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలతో భేటీ ఉంటుంది. నిజాం చెక్కర పరిశ్రమ సందర్శన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.ఆ బస్సు యాత్ర ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను రాహుల్ గాంధీ ఎండగట్టనున్నారు.