నేడు రాష్ట్రంలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పర్యటన

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులంతా ఇంటింటికి వెళ్లి ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేపడుతోంది. ఇవాళ ములుగు జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.

బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ రాహుల్, ప్రియాంక గాంధీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ములుగు చేరుకుంటారు. సాయంత్రం రామప్ప గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. బస్సు యాత్ర ప్రారంభం తర్వాత ములుగులో బహిరంగ సభలో పాల్గొని ప్రియాంక గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్ వచ్చి.. ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు. రాహుల్ గాంధీ మాత్రం మూడు రోజులు బస్సు యాత్రలో పాల్గొంటారు. సభ ఏర్పాట్లకు సంబంధించి.. ఎమ్మెల్యే సీతక్క దగ్గర ఉండి చూసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news