ఇవాళ దిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 55 మందితో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో 64 నియోజకవర్గాల్లోని  పోటీదారుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలుమార్లు జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలల్లోనూ ఈ స్థానాలపై సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్.. కొన్ని నియోజకవర్గాల్లో ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో.. ఏకాభిప్రాయం రాని నియోజకవర్గాలకు రెండేసి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించింది. ఒకటితోపాటు రెండు పేర్లతో రూపొందించిన జాబితాకు కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తరువాత ఏఐసీసీ అధికారికంగా విడుదల చేయనుంది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ దిల్లీలో మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపికపై చర్చించనుంది. మరోవైపు.. సీపీఐ, సీపీఎం పార్టీలతో ఇంకా కొలిక్కి రాని సీట్ల సర్దుబాటు ప్రక్రియ అంశం చర్చకు రానున్నట్లు సమాచారం. 64 నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో సామాజిక, రాజకీయ సమీకరణాలు, ప్రత్యర్థుల  బలాబలాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news