కాంగ్రెస్‌లో ‘డబుల్’ టిక్కెట్ల రగడ.. ఉత్తమ్, జానా కుటుంబాల నుంచి ఇద్దరు పోటీ?

-

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌లో రెండు టిక్కెట్ల రగడ రాజుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ఎంపీ ఉత్తమ్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ దఫా తాను పోటీ చేయడం లేదని గతంలోనే ప్రకటించిన సీనియర్‌ నేత జానారెడ్డి, తన ఇద్దరు కుమారులను రంగంలోకి దింపారు. వారికి మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌లో టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో అనివార్యం అయితే తప్ప ఉత్తమ్‌, జానారెడ్డి కుటుంబాల నుంచి ఇద్దరూ పోటీ చేయడం ఖాయంగా మారిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు.. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లోంచి మూడు పేర్లతో.. రాజకీయ ఎన్నికల కమిటీ (పీఏసీ) వచ్చే నెల 2న జరిగే సమావేశంలో తుది జాబితాను రూపొందించనుంది. టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసిన ఆశావహులు తమకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలను ఉపయోగించి తుది జాబితాలో తమ పేరు ఉండేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news