తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావడంతో నేటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ గన్ పార్క్ లోని అమరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.

‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికార గేయంగా జాతికి అంకితం ఇస్తారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై కళాకారుల ధూమ్ ధామ్ ప్రదర్శనలు, లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్ కార్యక్రమాలు ఉంటాయి.